పయనించే సూర్యుడు 26-5-2026 గొల్లపల్లి మండల రిపోర్టర్ (ఆవుల చందు ) జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో ని తిరుమలాపూర్ గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా.. 99 రోజుల ప్రణాళికను పురస్కరించుకుని తిరుమలపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ‘మహిళా వారోత్సవాల’ (ఉమెన్స్ వీక్) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని కిశోర బాలికలకు, గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో హిమోగ్లోబిన్ హెచ్ బి పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య స్థితిగతులను పరిశీలించారు.న్యూట్రి గార్డెన్స్ పెంచుకోవాలి:ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక సర్పంచ్ కాశ అంజలి గంగాధర్ మాట్లాడుతూ.. గ్రామంలోని కిశోర బాలికలు, గర్భిణీలు, బాలింతలు రక్తహీనత (ఎనీమియా) బారిన పడకుండా ఉండాలంటే విధిగా పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల ప్రాంగణాల్లో ‘న్యూట్రి గార్డెన్’ (పోషకాల తోటలు) ఏర్పాటు చేసుకుని, కూరగాయలను ఆహారంగా తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.అనంతరం ఐసీడీఎస్ సూపర్వైజర్ జానకి మాట్లాడుతూ.. బాలికల్లో రక్తహీనత నివారణకు సమతుల్య ఆహారం ఎంతో దోహదపడుతుందని వివరించారు. దైనందిన ఆహారంలో మొలకెత్తిన గింజలు, తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను భాగం చేసుకోవాలని అవగాహన కల్పించారు.
పెద్ద సంఖ్యలో పాల్గొన్న గ్రామస్తులు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం లక్ష్మి, అంగన్‌వాడీ టీచర్లు లాల్ బి, హరిత, తిరుమల, రమాదేవి, రాజేశ్వరిలతో పాటు అంగన్‌వాడీ ఆయాలు, ఆశా వర్కర్లు, పిల్లల తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.