తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం.

కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి కర్నూలు జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ.

పయనించే సూర్యుడు జూన్ 3 ఆదోని రూరల్ రిపోర్టర్ ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం (ఎస్ ఐ ఆర్) పై తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన వర్క్‌షాప్‌లో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, కొత్త ఓటర్ల నమోదు, అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లు ఓటరు జాబితాలో ఉండేలా తీసుకోవాల్సిన చర్యలు, బూత్ స్థాయి నిర్వహణ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. పార్టీ శ్రేణులు ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వర్క్‌షాప్‌లో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు పాల్గొని ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అనుసరించాల్సిన కార్యాచరణపై మార్గదర్శకాలు స్వీకరించారు.కర్నూలు జిల్లాలో కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా కృషి చేయాలని శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *