దాహార్తిని తీరుస్తున్న సాయిరాం రాంబాబు మీనాక్షి దంపతులు..

పయనించే సూర్యుడు మే 23, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు సాయిరాం రాంబాబు మీనాక్షి దంపతుల ఆధ్వర్యంలో స్వర్గీయ కొండలరావు జ్ఞాపకార్థం వారి భార్య సుబ్బలక్ష్మి చేతులమీదుగా ప్రతిరోజు మజ్జిగ కూలింగ్ వాటర్ పంపిణీ చేయడం జరుగుతుందని. సాయిరాం రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా గురువర్యులు మామిడిపల్లి రామారావు లక్ష్మీ దంపతుల ఆశీర్వచనాలతో గత 14 సంవత్సరాలుగా వేసవిలో దాహార్తిని తీర్చేందుకు మూడు నెలలపాటు మజ్జిగ ,లస్సి మరియు కూలింగ్ వాటర్ తో వాహనదారులకు, పాదచారులకు అభయ ఆంజనేయస్వామి ఆలయం మెయిన్ రోడ్డు వద్ద పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఈరోజు 33వ రోజునే రాగం పనేంద్ర హేమలత దంపతుల పెళ్లిరోజు సందర్భంగా 20 లీటర్ల పెరుగు 20 కూలింగ్ టిన్నులు అందించడం జరిగిందని వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు అని మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే దాతలు ముందుకు వస్తే మరింత మందికి దాహార్తించేందుకు ముందుకు వెళ్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ సభ్యులు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *