దౌల్తాబాద్‌లో పచ్చి రొట్టె ఎరువుల పంపిణీ ప్రారంభం

"పంపిణీ చేసిన పి ఎస్ సి ఎస్ చైర్మన్ వెంకట్ రెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల స్వామి"

పయనించే సూర్యుడు మే 22 రాజేష్ దౌల్తాబాద్ ) దౌల్తాబాద్ మండల కేంద్రంలో రైతులకు ఉపయోగపడే పచ్చి రొట్టె ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. దౌల్తాబాద్ కేంద్రంలోని ఆగ్రోస్-1లో పచ్చి రొట్టె ఎరువైన జనుము విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఎస్‌సీఎస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల స్వామి మాట్లాడుతూ రైతులకు పచ్చి రొట్టె జనుము విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రభుత్వం రైతులకు 50 శాతం సబ్సిడీపై జనుము విత్తనాలను అందజేస్తోందని వెల్లడించారు. ఒక్కో బస్తా 40 కిలోల బరువుతో ఉండగా ధర రూ.3,110గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రైతులు పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులు తీసుకుని రావాలని, సబ్సిడీ ద్వారా విత్తనాలు అందజేస్తామని తెలిపారు. పచ్చి రొట్టె ఎరువుల వినియోగం వల్ల నేల సారం పెరగడమే కాకుండా భూమిలో తేమ నిల్వ ఉండటానికి, సాగు ఖర్చులు తగ్గించడానికి దోహదపడుతుందని వివరించారు. దీంతో పంటలకు అధిక దిగుబడులు సాధించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో పీఎస్‌సీఎస్ డైరెక్టర్ రమేష్, ఉప సర్పంచ్ ఆది బాలకృష్ణ, ఏవో సాయికిరణ్, ఏఈఓ సంతోష్, రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో రైతులు హాజరై విత్తనాలను స్వీకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *