పెద్దమ్మతల్లి మహా ఊరేగింపులో సర్పంచ్ టోనీ వీర ప్రతాప్ పాల్గొనం

గ్రామ ప్రజల సుఖశాంతులు, రైతుల పాడిపంటల కోసం ప్రత్యేక ప్రార్థనలు

పయనించే సూర్యుడు న్యూస్ | జులై 8 సింగరేణి రిపోర్టర్ నరేష్ కారేపల్లి గ్రామంలో శ్రీ పెద్దమ్మతల్లి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన అమ్మవారి మహా ఊరేగింపు భక్తిశ్రద్ధల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మహోత్సవంలో కారేపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ మేదరి టోనీ వీర ప్రతాప్ గ్రామ పెద్దలు, మహిళలు, యువత, భక్తులతో కలిసి పాల్గొని అమ్మవారి మహా ఊరేగింపులో అడుగులు కలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మేదరి టోనీ వీర ప్రతాప్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో జీవించాలని, ప్రతి ఇంట ఆనందాలు వెల్లివిరియాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతుల పాడిపంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆధ్యాత్మిక వేడుకలు గ్రామ సమాజాన్ని ఒకే తాటిపైకి తీసుకువస్తాయని, భక్తి, ఐక్యత, సామరస్య భావాలను మరింత పెంపొందిస్తాయని అన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలు చిరస్థాయిగా నిలవాలంటే ఇటువంటి బ్రహ్మోత్సవాలను ప్రతి ఒక్కరూ భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత, భక్తులను సర్పంచ్ ప్రత్యేకంగా అభినందించారు. మహా ఊరేగింపు సందర్భంగా గ్రామమంతా భక్తిరసంలో మునిగిపోయి ఆధ్యాత్మిక శోభ సంతరించుకోగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారి ఆశీస్సులు పొందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *