పోలవరం ముంపు ప్రాంత ప్రజలను ఆదుకోండి…

* సిడబ్ల్యుసి( పోలవరం ప్రాజెక్టు అథారిటీ) కి వినతి పత్రం అందజేత.. * ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ప్రకటించండి... * పోలవరం బాధితులకు శాశ్వత పరిష్కారం చూపించాలి

పయనించే సూర్యుడు, జూన్ 03 ,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశానుసారం అశ్వాపురం మండలం బూర్గంపాడు మండలాలకి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు బుధవారం సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్ నందు సిడబ్ల్యుసి అధికారుల ను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో వచ్చినటువంటి వరద దృష్ట్యా 1986 తర్వాత అంత వరద రావడం దీనికి కారణం పోలవరం డ్యాం ప్రధాన కారణమని కాబట్టి పోలవరం ముంపు ప్రాంతం బాధితుల ప్రధాన డిమాండ్లు గురించి వారికి వివరించడం జరిగినది. సమగ్ర బ్యాక్ వాటర్ అధ్యాయాన్ని తక్షణం నిర్వహించాలనీ , తెలంగాణ ముంపు గ్రామాలకు ప్రత్యేక ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ప్రకటించాలనీ పోలవరం ఆపరేషన్ రూల్ కర్వ్ ను సవరించాలి పోలవరం డిజైన్ మరియు స్పెల్ వే సామర్థ్యాన్ని పునః సమీక్షించాలనీ కిన్నెరసాని ముర్రేడు తదితర వాగులపై ప్రత్యేక అధ్యయనం చేయాలన్నారు అంతేకాకుండా భద్రాచలం పట్టణానికి శాశ్వత వరద రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలనీ . పినపాక నియోజకవర్గం లో కొత్త ప్లడ్ ప్రొటెక్షన్ వాల్స్ నిర్మించాలి మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్ కు ప్రత్యేక భద్రత కల్పించాలి గోదావరిలో భారీ స్థాయిలో డిసీల్టింగ్ పనులు చేపట్టాలని,తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ నిర్ణయాన్ని అమలు చేయరాదన్నారు , పై రక్షణ చర్యలు అన్నిటిని పోలవరం ప్రాజెక్టు కంపోస్టెంటులో చేర్చాలన్నారు అంతేకాకుండా కర కట్టలు పంపింగ్ స్టేషన్ లు, డిస్టిల్లింగ్ రక్షణ గోడలు పునరావాస చర్యలు తదితర అన్ని పనులను పోలవరం ప్రాజెక్టు వ్యయంలో భాగంగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు కేటాయించాలి. పైడిమాండ్లను తప్పక అమలు చేయాలని లేని పక్షంలో తెలంగాణ ప్రజల ఆస్తుల రక్షణ కోసం ఎటువంటి ఆందోళనల కైన వెనకాడకుండా బిఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్య బద్దంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గోపిరెడ్డి రమణా రెడ్డి,అశ్వాపురం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోడి అమరేందర్ , మండల ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి బిఆర్ఎస్ పార్టీ నాయకులు వెన్న అశోక్ కుమార్, కంచు గంట్ల వీరభద్రం, గొర్రె ముచ్చు వెంకటరమణ, శివ్వారపు డాక్టర్ బాబు , బూర్గంపాడు మండల పార్టీ నాయకులు కర్రీ నాగేశ్వరరావు, భూక్య కృష్ణ, బొబ్బిలి దాసు, గోపికృష్ణ, రామకృష్ణ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *