ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి : చమర్తి

పయనించే సూర్యుడు-06-06-2026-రాజంపేట న్యూస్ : ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని నియోజకవర్గ ఇన్చార్జి చమర్తి జగన్ మోహన్ రాజు తెలియజేశారు. శుక్రవారం స్థానిక నియోజకవర్గ పార్టీ కార్యాలయం నందు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని చమర్తి జగన్ మోహన్ రాజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలియజేశారు. ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. అనంతరం ప్రజలనుంచి అర్జీలను స్వీకరించి ప్రతి అర్జీని శ్రద్ధగా పరిశీలించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తూ సంబంధిత శాఖల అధికారులకు వెంటనే చర్యలు తీసుకుని సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *