ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఇంటర్ విద్యార్థినిలు

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్.07.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ// ఇటీవల నిర్వహించిన డైట్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలలో స్థానిక జడ్పీహెచ్ఎస్ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినిలు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు ప్రధాన ఉపాధ్యాయుడు సి ఉమా శంకర్ రెడ్డి తెలిపారు డైట్లో కల్పన 163 ర్యాంకు లలిత 449 సమీరా 536 స్వప్న 713 ప్రసన్న 1419 రుక్సార్ 1458 భానుశ్రీ 2213 ర్యాంకు సాధించారు అదేవిధంగా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ లో లలిత సంధ్య తరుణ లు ప్రతిభను కనబరిచారు అధ్యాపకుల సూచనలు, సలహాలు పాటించి సెలవులు వృథా చేయకుండా ప్రవేశ పరీక్షలు రాసి అందులో విజయం సాధించి వారి బంగారు భవిష్యత్తు కు బాటలు వేసుకున్న ఈ విద్యార్థులకు విజయాభినందనలు కళాశాల ప్రిన్సిపాల్ ఉమా శంకర్ రెడ్డి తెలియజేశారు వీరి విజయానికి కృషి చేసిన కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అమర్నాథ్ రెడ్డి రమణప్ప సుదర్శన్ సోమశేఖర్ రాజన్న విజయలక్ష్మి కృషి అమోఘమని విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ బాలికల కళాశాలలో ఉపాధ్యాయులు అంకుటిత దీక్షతో పనిచేస్తూ తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేశారని కొనియాడారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *