ప్రాథమిక సహకార సంఘం లోమృతి చెందిన వారికీ ఇన్సూరెన్స్ డబ్బు

పయనించే సూర్యుడు: రిపోర్టర్ శ్రావణ్ రాజ్ అనకాపల్లి జిల్లా చోడవరం మండలం ప్రాథమిక సహకార సంఘము లో మృతి చెందిన వారికీ సభ్యులకు ఇన్సూరెన్స్ బట్వాడా చేయడం జరిగినది ఈ సంవత్సరము 24 మంది సభ్యులకు మూడు లక్షల 55 వేల రూపాయలు బట్వాడా చేయడం జరిగింది అదేవిధంగా ఈ సంఘ పరిధిలో గ్రామంలో గల సభ్యులు కానీ రైతులు ఈ సంఘంలో సభ్యులుగా జాయిన్ అయ్యి ఈ సంఘం నుండి తక్కువ వడ్డీకి అప్పుడు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది ఈ సంఘములో కమర్షియల్ బ్యాంక్ కంటే తక్కువ సమయంలో అప్పులు మంజూరు చేసి బట్వాడా చేయబడును ఈ సంఘములో అప్పులు తీసుకొని చనిపోయిన రైతులకు జనరల్ డెత్ ఇన్సూరెన్స్ 59 సంవత్సరాలు లోపు వారికి 50,000 రూపాయలు 59 సంవత్సరాలు పైబడిన వారికి 25 వేల రూపాయలు డెత్ ఇన్సూరెన్స్ కింద ఇవ్వడం జరుగుతుంది జిల్లా కేంద్ర సహకార బ్యాంకు విశాఖపట్నంవారి సహాయంతో ఈ ఇన్సూరెన్స్ పథకం ప్రవేశపెట్టిన జరిగింది సంఘంలో సంఘ పరిధిలో గల రైతులు అందరు కూడా ఈ సంఘంలో సేవింగ్స్ డిపాజిట్ అకౌంట్ రన్ చేసిన ఎడల వడ్డీ ఐదు పర్సెంట్ అలాగే డిపాజిట్లపై 8.5% చొప్పున అన్ని బ్యాంకులు కానీ ఎక్కువగా ఇవ్వబడును అదేవిధంగా సంఘ పరిధి లోగల సభ్యులకు గృహ అవసరములకు హౌసింగ్ లోన్ మరియు వ్యవసాయ ఎస్టిఅద ర్ అప్పులు ఎకరాకి ఐదులక్ష రూపాయలు మంజూరు మంజూరు చేసి తక్కువ సమయంలో తక్కువ వడ్డీకి బట్వాడా చేయగలము జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వారి విశాఖపట్నం వారి సహాయంతో కావున ఈ అవకాశాన్ని ఈ చోడవరం పాక్స్ కుటుంబ సభ్యులు అందరూ కూడా వినియోగించుకోవలసిందిగా కోరుచున్నాము సంఘ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుచున్నాము మరియు ఈ సంఘ పరిధిలో ఉన్న సభ్యులందరికీ కూడా మా యొక్క సేవలను వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము ఇట్లు సంఘ చైర్మన్ గునూరు మూలినాయుడు మరియు డైరెక్టర్ పాలకవర్గ సభ్యులు దాడి నాగప్పారావు సూర్య ప్రకాష్ రావు డైరెక్టర్ మరియు సంఘ సీఈవో జి సింహాచలం మరియు సిబ్బంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *