పయనించే సూర్యుడు గూడూరు న్యూస్ జూన్ 14 గూడూరు పట్టణానికి మున్సిపల్ కమిషనర్ గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున రావు కి బిఎస్పి పార్టీ. రాష్ట్ర కార్యదర్శి నాసీన భాస్కర్ గౌడ్ గూడూరు పట్టణ అధ్యక్షులు జి వెంకటేశ్వరరాజు, మీజూర్ సుబ్రహ్మణ్యం గూడూరు నియోజకవర్గం బి ఎస్ పి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మరియు ఎపీ ప్రజా సంఘాలు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు ఎల్వి సుబ్బయ్య ఆధ్వర్యంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ కి శాలువాతో ఘన సత్కారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎల్.వి సుబ్బయ్య కమిషనర్ దృష్టికి గూడూరు లో ఉన్న పలుసమస్యలు తెలియజేశారు. ఒకటవ, రెండో పట్టణంలో మున్సిపల్ పరిధిలో ఉన్న పలు ప్రాంతాలలో , గాంధీనగర్ ఏరియాలలో , మున్సిపల్ స్థలాల ఆక్రమణలు తొలగించి, ప్రజలకు వాహనదారులకు ట్రాఫిక్కు ఇబ్బందు లేకుండా చూడాలన్నారు. మురికి కాలువలపై ఉన్న కబ్జాలు తొలగించి, రోడ్లు వెడల్పు చేసేలా తగుచర్యలు తీసుకోవాలని, గాంధీనగర్ ఏరియాలలో మున్సిపల్ స్థలాలు ఆక్రమణలు తొలగించి ప్రజలకు వాహనదారులకు ట్రాఫిక్కు ఇబ్బందు లేకుండా, రోడ్లు వెడల్పు చేసేలా తగుచర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది