భర్తని కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళకు హార్దిక సహాయం అందించిన చిన్ననాటి స్నేహితులు

నిస్సహాయ స్థితిలో చిరు సహాయమే కొండంత ఓదార్పు

పయనించే సూర్యుడు న్యూస్, మే 20,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాక – రాజీవ్ నగర్ కాలనీ (గాంధీనగర్) లో నివాసం ఉంటున్నటువంటి దారా సునీత,భర్త దారా రాజు మే 02 న గుండెపోటుతో అకాల మరణం చెందారు. సునీత ఇద్దరి ఆడపిల్లలు పెట్టుకుని దిక్కుతోచని దయనీయస్థితిలో ఉన్నది. ఆ విషయం తెలుసుకున్న సారపాక గవర్నమెంట్ స్కూల్ లో 1997 సంవత్సరంలో 7వ తరగతి తమతో పాటు చదివినటువంటి చిన్ననాటి స్నేహితులు అందరూ కలిసి సునీతకు కొంత ఆర్థిక సహాయము అదేవిధంగా రెండు నెలలు నిత్య అవసరాలు సహాయం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో రఫీ, నర్సింహారావు, కుమార్, మోహన్,హరింద్రచారి,ప్రవీణ్, సిద్ది రాజు ఇంకా కొంతమంది స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *