పయనించే సూర్యుడు జూలై 3, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి ) పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కృషి తో గ్రామాలలో వి బి జి రామ్ జి పధకం తో పెద్ద ఎత్తున మౌలిక వసతులు లభించనున్నాయని మాజీ సర్పంచ్ అడబాల రత్న ప్రసాద్ పేర్కొన్నారు. రమణయ్యపేటలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గ్రామీణ భారతదేశనికి కీలకమైన జీవనాడిగా ఉపాధి హామీ పథకం ఇప్పటివరకు నిలిచిందన్నారు. గ్రామీణ పేదరికం తగ్గించడం, ఉపాధిని సృష్టించడం, వలసలను అరికట్టడం, సమాజ ఆస్తులను సృష్టించడం.. లక్ష్యంగా ఉపాధి హామీ పథకం అనేక ప్రయోజనాలను అందించిందన్నారు. దాని స్థానే జూలై 1 నుండి అమలులోకి వచ్చిన వి బి జి రామ్ జి పథకం మౌలిక వసతులు కల్పిస్తూ కొత్త అధ్యాయం సృష్టించ ను0దని అన్నారు. గ్రామాలలో అభివృద్ధి కొత్త మలుపు తిరగనుందని అన్నారు. పంచాయతీరాజ్ శాఖ ను పవన్ కళ్యాణ్ చేపట్టిన నాటి నుండి గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలలో ఉత్తమ పనితీరు కనబడుతుందన్నారు. దేశంలోనే మన రాష్ట్ర గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రగతి పథంలో ముందుందన్నారు. ప్రతి ఏటా కేంద్రం విడుదల చేసే నిధులలో సింహభాగం మన రాష్ట్రానికి దక్కిందన్నారు. అదేవిధంగా పలు అవార్డులు కూడా లభించాయన్నారు. అభివృద్ధి పనులతో పల్లె ప్రజల జీవితాలలో గణనీయమైన మార్పు కనపడుతుందన్నారు. సిమెంట్ రోడ్లు ,డ్రైన్లు, అంగన్వాడీ భవనాలు, పంచాయతీ భవనాలు, మినీ గోకులాలు తదితర ఆస్తులు కల్పించబడ్డాయన్నారు. వి బి జి రామ్ జి పథకం అమలుకు కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 5,019 కోట్లు కేటాయించగా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ. 3346 కోట్లు కేటాయించింద న్నారు మొత్తం రూ. 8365 కోట్ల తో గ్రామాలలో అభివృద్ధి పనులు జరుగనున్నాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాలను సమృద్ధిగా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్న మంత్రి పవన్ కళ్యాణ్ విబిజి రామ్ జి పధకం తో గ్రామాలలో కొత్త అధ్యాయం సృష్టించనున్నారని అడబాల తెలిపారు .