పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మే 26 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ మండలం కొత్తపేట గ్రామంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా వారోత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రం–2లో గర్భిణీ మహిళలకు శ్రీమంతాలు, చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా పోషకాహార పదార్థాలు, చిరుధాన్యాల వినియోగంపై మహిళలకు అవగాహన కల్పించారు. ఆరోగ్య పరిరక్షణలో పోషకాహారం కీలకమని వివరించారు.కార్యక్రమంలో సర్పంచ్ మీనుగు రాజగంగు అంజయ్య, ఉపసర్పంచ్ తునికి రంజిత్‌కుమార్, కార్యదర్శి రాజేష్, వార్డు సభ్యులు, కారోబార్ రమేష్, అంగన్వాడీ టీచర్లు అనురాధ, లలిత, సుజాత, ఆశా కార్యకర్తలు రజిత, సత్యవతి, ఆయమ్మలు బుచ్చమ్మ, శంకరవ్వ, లక్ష్మి, గర్భిణీలు,చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.