పయనించే సూర్యుడు న్యూస్ సింగరేణి రిపోర్టర్ నరేష్ జూన్ 5 ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం సింగరేణి మండలం మాణిక్యారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకురాలు మనిషా లక్ష్మి (మదన్ లాల్ కుమార్తె) విస్తృతంగా పర్యటించారు. గ్రామ మాజీ సర్పంచ్ భూక్యా రంగారావు కుమారుడి వివాహ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వివాహ వేడుకకు హాజరైన పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, తన తండ్రి మదన్ లాల్ ఆశయాల సాధన కోసం తాను ప్రజాక్షేత్రంలోకి వచ్చానని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి మండల మాజీ జెడ్పీటీసీ ఉన్నం వీరేందర్, వాంకుడోత్ జగన్ నాయక్, డొంకెన రవీందర్, లకావత్ రాము, తెలగర్ల రామారావు, ధారావత్ వికాస్, మాజీ సర్పంచ్ కర్సం సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ శివరాత్రి అచ్చయ్య–పార్వతి, జడల కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.