మాతృశ్రీ గండిపోచమ్మ ఆలయ సంరక్షణ కొరకు పి.గొందూరు గ్రామప్రజలు ధర్నాకు పిలుపు.

ధర్నాకు పిలుపు.

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ జూన్.07.2026 పోలవరం జిల్లా,దేవీపట్నం మండలం,పి.గొందూరు గ్రామంలో స్వయంభువుగా వెలిసిన మాతృశ్రీ గండిపోచమ్మ ఆలయ పునర్నిర్మాణంలో ఆలస్యం వహించటంలో గ్రామస్థులు ఆవేదన వ్యక్తంచేశారు. పోచమ్మగండి ఆలయ ప్రధాన పూజారి సోదే బాబి దొర.మాట్లాడుతూ…మా సోదే వారి ఆడపడుచు,మా గ్రామదేవత,కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి మాతృశ్రీ గండిపోచమ్మ అమ్మవారి ఆలయ సంరక్షణలో భాగంగంగా కూటమి ప్రభుత్వం రెండువందల ఏడుకోట్లు మంజూర. చేసిన విషయం అందరికీ తెలుసు అయిన మా అమ్మవారి గుడి సంరక్షణ నిర్మాణంలో అధికారులు ఆలస్యం ఎందుకు వహిస్తున్నారో అర్థంకవటంలేదని తెలిపారు.ఈ విషయంలో భాగంగా సోమవారం అంగుళూరు గ్రామంలో ధర్నా చేయటానికి మా పి.గొందూరు గ్రామప్రజలు అందురు సిద్ధంగా ఉన్నారు,అదేవిధంగా అన్ని విశ్వహిందూ సంఘాలు మా గుడి నిర్మాణంలో పూర్తి మద్దతు ఇవ్వాలని,ధర్నా కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పి గొందూరు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *