మిట్ట కంకల్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మకళ్యాణ మహోత్సవం కార్యక్రమంలోపాల్గొన్న భేరి రామచందర్ యాదవ్

పయనించే సూర్యుడు, మే 24 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎంకుమార్ వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పూడూరు మండల్ మిట్ట కంకల్ గ్రామం లో శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం బేరి ఆంజనేయులు యాదవ్ లక్ష్మీ యాదవ్ మరియు బేరి వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్ర మంలో పాల్గొన్న బీసీ కులాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ బేరి వారి పూర్వీకుల ఇల వేల్పు ఇంటి దేవత వాగు ఎల్లవ్వ అమ్మవారు బేరి వారి వంశాన్ని తరతరాలుగా బేరి వారి కుటుంబ సభ్యులను బంధుమిత్రులని ఎల్లవేళలా చల్లగా దీవీస్తుంది. ఏ కష్టం వచ్చినా అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకొని పూజించిన అమ్మ వెంటనే అన్ని ఆపదల నుండి కాపాడి బేరి వారి వంశంతో పాటు గ్రామ ప్రజలను రక్షిస్తుంది. గ్రామంలోని అందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఆనందంగా ఐక్యమత్యంగా జీవించాలని అమ్మవారిని బేరి రామచంద్ర యాదవ్ వేడుకున్నారు. పూజా కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రావుల గోపాల్, మాజీ సర్పంచ్ మొర్రి శ్యాం కుమార్, ఉప సర్పంచ్ మొర్రి బందయ్య వార్డ్ మెంబర్ శ్రీనివాస్, లక్ష్మణ్, బేరి రఘురాములు సంధ్య, చేవెళ్ల కృష్ణ యా దవ్, బేరి రామయ్య రాములమ్మ, బేరి యాదయ్య యాదమ్మ, బేరి కృష్ణ పద్మమ్మ, యూత్ ప్రెసిడెంట్ బేరి ఆంజనేయులు యాదవ్, అంజి, యువజన నాయకులు రావుల రమేష్, రావుల దశరథ్, రావుల శంకర్, బేరి వారి కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలు యువజన నాయకులు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు అన్న ప్రసాదాలు స్వీకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *