మియాపూర్‌లో ఆదిలక్ష్మి ఫుడ్కోర్ట్ ప్రారంభోత్సవంలో అతిథిగా పాల్గొన్న యలమంచి ఉదయ్ కిరణ్,

పయనించే సూర్యుడు,జూన్ 13 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎంకుమార్ మియాపూర్‌లో నూతనంగా ప్రారంభ మైన ఆదిలక్ష్మి ఫుడ్ కోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మరియు ఛైర్మన్, మియాపూర్ డివిజన్ జనరల్ సెక్రటరీ శ్రీ యలమంచి ఉదయ్ కిరణ్ ముఖ్య అతి థిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు మియాపూర్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ తాండ్ర రాంచందర్ గౌడ్ కూడా హాజరయ్యారు. ఆదిలక్ష్మి ఫుడ్ కోర్ట్ యాజమాన్యం ఆహ్వానం మేరకు జరిగిన ఈ కార్యక్ర మంలో నూతన వ్యాపార ప్రయా ణాన్ని ప్రారంభిస్తున్న యాజమా న్యానికి శ్రీ యలమంచి ఉదయ్ కి రణ్ హృదయపూర్వక శుభా కాంక్షలు తెలియజేశారు. వ్యాపార రంగంలో విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ, వారి కృషి, పట్టు దలను అభినందించి శాలువాతో సత్కరించి గౌరవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ..యువ పారిశ్రామికవేత్తలు ఉపాధి అవకాశాలను సృష్టిస్తూ సమాజాభివృద్ధికి తోడ్పడటం అభినందనీయమని పేర్కొన్నారు. వ్యాపార రంగంలో నాణ్యత, వినియోగదారుల విశ్వాసం సేవా భావం విజయానికి మూల సూ త్రాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ ప్రాంతాని కి చెందిన పెద్దలు, ప్రముఖులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, చంద్రమౌళి, వెంకటేష్,రత్నాచారి తదితరులు పాల్గొ ని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు నాణ్యమైన సేవలను అందిస్తూ ఆదిలక్ష్మి ఫుడ్ కోర్ట్ మరింత అభివృద్ధి చెంది విజయవంతంగా ముందుకు సాగాలని శ్రీ యలమంచి ఉదయ్ కిరణ్ ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *