రీ సర్వేలో లోపాలు-ఇష్ట రాజ్యాంగా సిబ్బంది తీరు.సరైన రికార్డ్స్ లేకుండా కొలతలు-గందరగోళంలో రైతులు.సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు.

పయనించే సూర్యడు మే.23.2026″ఆదివాసి సంక్షేమ వర్షిత్”ఉమ్మడి అల్లూరి జిల్లా అధ్యక్షులు తీగల బాబురావు.అడ్డతీగల మండలం పరిధిలో ఉన్న దుప్పులపాలెం మరియు జల్లూరు గ్రామంలో జరిగిన భూ రీ-సర్వే సక్రమంగా జరగలేదని,లోపాలు ఉన్నాయని,సిబ్బంది.తీరు ఇష్టనుశారంగా ఉందని “ఆదివాసి సంక్షేమ పరిషత్” (274/16) ఉమ్మడి జిల్లా అధ్యక్షులు తీగల బాబురావు అన్నారు.దుప్పులపాలెం గ్రామంలో రామాలయం భూమి సర్వే చేయలేదని,అలాగే కొంతమంది రైతులకు సమాచారం ఇవ్వకుండా.ఆ రైతుల భూములు రీ సర్వే చేశారని.అలాగే సర్వేకు పూర్వం నుండి గ్రామంలో స్మశాన భూమి ఉందని అయితే ఆ వివరాలు రికార్డులో లేకపోవటం బాధాకరమని అన్నారు.అదే విధంగా జల్లూరు గ్రామానికి సంబందించి విలేజ్ మ్యాప్ లేకుండానే సిబ్బంది.రీ సర్వే చేశారాని,సరిహద్దులు మరియు విస్తీర్ణం లాంటి వివరాలు రైతులకు తెలపకపోవటం,రైతుల సాగులో ఉన్న భూములు మార్పులు జరగటం.వల్ల రైతులు గందరగోళానికి గురి అవుతున్నారని అన్నారు.అయితే సిబ్బంది అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నందున ఈ విషయంలో విచారణ జరిపి సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని.సంబంధిత అడ్డతీగల మండల తహసీల్దార్ వారికి ఈ ప్రకటన ద్వారా తెలుపుతున్నమ్మన్నారు. అలాగే పోలవరం జిల్లా కలెక్టర్ వారికి కూడా పిర్యాదు చేస్తామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *