రైతులకు మేలు చేసే నీటి సంఘాలను పునరుద్ధరించాలి

మాజీ నీటి సంఘము చైర్మన్ దొంతురి యాదగిరి ప్రభుత్వానికి విజ్ఞప్తి

పయనించే సూర్యుడు జూన్ 06(హైదరాబాద్ ) తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని శాలిగౌరారం మండలం మాధవరం కలాన్ మాజీ నీటి సంఘము చైర్మన్ దొంతురి యాదగిరి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రైతుల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని తెలిపారు.ఈ సందర్భంగా రైతులకు ప్రత్యక్షంగా మేలు చేసే నీటి సంఘాలను తిరిగి ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతి చేశారు. నీటి సంఘాలు సమర్థవంతంగా పనిచేస్తే కాలువల నిర్వహణ మెరుగుపడి సాగునీటి పంపిణీ పారదర్శకంగా జరుగుతుందని పేర్కొన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో రైతుల సమస్యలు త్వరగా పరిష్కారం కావడానికి నీటి వనరుల పరిరక్షణకు మరియు పంటల సాగుకు నీటి సంఘాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నీటి సంఘాలను పునరుద్ధరించటకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని మాజీ నీటి సంఘము చైర్మన్ దొంతురి యాదగిరి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *