పయనించే సూర్యుడు జూన్ 9 పెద్ద శంకరంపేట మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్నా అశోక్) ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని శంకరంపేట మండల రైతు వేదికలో ఎరువులు విత్తనాలు పురుగుమందుల డీలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు మండల తహసీల్దార్ (ఎమ్మార్వో) నారాయణ మండల వ్యవసాయ అధికారి నాగం కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో డీలర్లకు పలు కీలక సూచనలు చేశారు రైతులకు నాణ్యమైన ప్యాకింగ్ మరియు లేబులింగ్ ఉన్న గడువు ముగియని విత్తనాలను మాత్రమే విక్రయించాలని సూచించారు విత్తనాలతో పాటు తప్పనిసరిగా బిల్లు అందించాలని స్పష్టం చేశారు ఎరువుల విక్రయాలు పీఓఎస్ యంత్రాల ద్వారానే నిర్వహించాలని స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే అమ్మకాలను నిలిపివేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు దుకాణాల వద్ద స్టాక్ బోర్డులో ఎరువులు విత్తనాల నిల్వలు ధరల వివరాలు స్పష్టంగా ప్రదర్శించాలని తెలిపారు టాస్క్‌ఫోర్స్ బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అమ్మకాలు నిల్వలను పరిశీలిస్తాయని డీలర్లకు వివరించారు ఈ సమావేశంలో ఆర్ఐ నాగరాజు ఏఈవో వినీత్ మండలంలోని ఎరువులు విత్తనాలు పురుగుమందుల డీలర్లు పాల్గొన్నారు.