పయనించే సూర్యుడు మే 28 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. ఆదోని పట్టణం నూతన బైపాస్ రోడ్ వద్ద ఉన్న బ్లాక్ స్పాట్‌ను జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి , జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ , ఆదోని ఎమ్మెల్యే డా. పార్థసారథి పరిశీలించారు.రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు వంటి అంశాలపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ప్రయాణించాలని సూచించారు.