వడ్ల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం

"అకాల వర్షంతో తడిసిన ధాన్యం ఆందోళనలో రైతులు" "తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి సిపిఎం పార్టీ డిమాండ్"

పయనించే సూర్యుడు మే 28 రాజేష్ దౌల్తాబాద్ ) రాత్రి కురిసిన అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాలలో పూర్తిగా తడిసిపోయిన వడ్లు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.భాస్కర్ అనంతరం జి.భాస్కర్ మాట్లాడుతూ రైతులు పంటలు పండించి సొసైటీ మరియు ఐకేపీ కొనుగోలు కేంద్రాలలోకి వరి ధాన్యాన్ని తీసుకువచ్చి రెండు నెలల పూర్తవుతున్న రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం వలన రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతుందని విమర్శించారు.రాత్రి అకాల వర్షం కురవడం వలన వడ్లు పూర్తిగా తడిసిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కొనుగోలు కేంద్రాలకు సరిపడా లారీలను సరైన సమయంలో పంపించకపోవడం మరియు రైస్ మిల్లర్లు జాప్యం చేయడం వలన రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని మండపడ్డారు. రైతులు కష్టపడి పంట పండించిన ధాన్యాన్ని అమ్ముకుంటే పెట్టుబడి కూడా మిగలడం లేదని ఆవేదనలో ఉన్నారని తెలిపారు. అధికారులు,ప్రభుత్వము రైతే రాజు అని గొప్పలు చెప్పుకునే వీరికి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి తీరిక లేదని విమర్శించారు. వీటికి తోడు రైతులు ధాన్యం తూకం వేసి రైస్ మిల్లులకు పంపిన తర్వాత తూకంలో కోతలు విధిస్తూ రైస్ మిల్లర్లు రైతులకు తీవ్ర నష్టం చేస్తున్నారని వీటి నివారణకు ప్రభుత్వం గాని అధికారులు కానీ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు.రైతులకు నష్టం చేసే రైస్ మిల్లర్లపైన ప్రభుత్వము మరియు అధికారులు వెంటనే చర్యలు చేపట్టి రైతులకు మేలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు కంపే ఎల్లయ్యా రైతులు నర్సయ్య, నారాయణరెడ్డి,ప్రతాప్ రెడ్డి,లక్ష్మి, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *