వైఎస్సార్సీపీ నాయకుడి ద్విచక్ర వాహనం కాల్చివేత

జనం న్యూస్ జూన్ 7 చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం రిపోర్టర్ భీమనేని బాలకృష్ణ. వైయస్సార్సీపి నాయకుడి ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియనిదుండగులు కాల్సి వేసినట్లు బాధితుడు మోమన్ రెడ్డి తెలిపారు. బాధితుని కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజక వర్గంలోని రొంపిచెర్ల మండలం చల్లావారిపల్లె గ్రామ పంచాయతీ వైఎస్సార్సీపీ కన్వీనర్ మోహన్ రెడ్డి తన (ఏపీ 03 ఏసీ 8615) ద్విచక్ర వాహనాన్ని ఈనెల 4వ తేది రాత్రి వ్యవసాయ పొలం వద్ద పెట్టినట్లు తెలిపారు. రాత్రి ఎవరో గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ పోసి కాల్చి వేశారని తెలిపారు. ఉదయం వెళ్లి చూడగా ద్విచక్ర వాహనం పూర్తిగా కాలి పోయిందన్నారు. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకనే ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వారు కాల్చి వేశారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయమై రొంపిచెర్ల పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రొంపిచెర్ల పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *