శాంతియుత వాతావరణంలో బక్రీద్ జరుపుకోవాలి:

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మే 21.05.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం ప్రతినిధి జె. నాగరాజ// అఖిల భారత గోరక్ష మహా సంఘ్ జాతీయ కార్యదర్శి డా. పి. అయూబ్ ఖాన్ పిలుపు ​చట్టాలను గౌరవిస్తూ, సమాజంలో లేనిపోని గొడవలకు తావివ్వద్దు. ఈ బక్రీద్‌కు ఆవులు, ఎద్దులు, దూడల ఖుర్బానీ పూర్తిగా మానేయాలి. స్థోమతను బట్టి మేకపోతులు, గొర్రెపోతులను మాత్రమే ఖుర్బానీ ఇవ్వండి. దేశానికి వెన్నెముక లాంటి వ్యవసాయ రంగంలో గోవుల పాత్ర అమూల్యమైనదని, అత్యంత పవిత్రమైనదని అఖిల భారత గోరక్ష మహా సంఘ్ జాతీయ కార్యదర్శి డా. పి. అయూబ్ ఖాన్ పేర్కొన్నారు. పశుసంపదను, గోవుల పవిత్రతను కాపాడుకోవడానికి తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ గోవధ నిషేధ మరియు సంరక్షణ చట్టం 1977 ను ప్రభుత్వ అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో కఠినంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ​ఇదే సందర్భంలో రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులకు డా. పి. అయూబ్ ఖాన్ ఒక ప్రత్యేకమైన మరియు హృదయపూర్వకమైన విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *