షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియమకాల చట్టం ప్రకటించాలి.

ఏపీ ఆదివాసీ జేఏసీ డిమాండ్.

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మే.28.2026 పోలవరం జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,దేవీ పట్నం మండలం,దేవారం గ్రామపంచాయతీ పరిధిలోని పోతవరం గ్రామంలో ఉన్న శ్రీ కోదండ రామాలయం నందు ఆదివాసీల ప్రజా సమస్యలపై సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశానికి ఏపీ ఆదివాసీ జేఏసీ మండల కార్యదర్శి యలగాడ నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ మాట్లాడుతూ…తక్షణమే (టి.ఏ.సి) ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ద్వారా తీర్మానం చేసి షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియమకాల చట్టం ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదివాసీలకు ఇచ్చిన హామీ నెరవేర్చి ఆదివాసీ నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉన్న 1917,1959,1/70 భూమి చట్టాలు,అటవీ హక్కుల చట్టం,పెసా చట్టం పటిష్టంగా అమలుకావాలంటే ఆదివాసుల స్వయం పాలన రాష్ట్రం సాధించుకున్నప్పుడే ఆదివాసీల సంక్షేమం,అభివృద్ధి జరుగుతుందన్నారు.ఆ దిశగా ఆదివాసులు మలిదశ శాంతియుత ఉద్యమానికి ఆదివాసీ యువతి యువకులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ మాట్లాడుతూ…పోలవరం నిర్వాసితులకు కొత్త చట్టం ప్రకారం శాస్త్రీయ సమగ్ర పునరావాసం కల్పించాలని,ఏజెన్సీ మారు మూల గ్రామాలకు మౌలిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ నిరుద్యోగ హక్కులు ఉద్యోగాల సాధన కమిటీ జిల్లా అధ్యక్షులు మడి మురళి,భారత్ ఆదివాసీ పార్టీ మండల నాయకులు కుంజం రామన్న దొర,జిల్లా స్టీరింగ్ కమిటీ కార్యనిర్వహణ అధ్యక్షుడు చవలం విద్యాసాగర్,కారం రంగా రావు దొర,ఆల్ ఇండియా ఆదివాసీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జిల్లా మహిళ అధ్యక్షురాలు దూసరి కనకదుర్గ,ఎంపిటిసి తుర్రం జగదీష్ దొర, ఏపీ ఆదివాసీ జేఏసీ మండల కార్యదర్శి యలగాడ నాగేశ్వరరావు, మడకం కృష్ణ దొర, కుంజం శ్రీనివాస్ మరియు గ్రామ పెద్దలు, మహిళలు, యువతీ యువకులు మొదలైన వారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *