సీఎండీ లే అవుట్ వద్ద డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు.

పయనించే సూర్యడు పత్రిక జూలై 07 గోకవరం మండల రిపోర్టర్ దొరబాబు: గోకవరం తంటికొండ రోడ్డులోని సీఎండీ లే అవుట్ వద్ద భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125 జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ జగ్గంపేట నియోజకవర్గం బీఎల్ఏ-1 కంబాల శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామా ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ దేశ సమగ్రత, ఏకతా భావం కోసం శ్యామా ప్రసాద్ ముఖర్జీ చేసిన పోరాటాలు, త్యాగాలు మరువలేనివని కొనియాడారు. ఒక దేశంలో రెండు జెండాలు, రెండు చట్టాలు ఉండకూడదని ఆయన ఆనాడే గళమెత్తారని గుర్తుచేశారు. భారతదేశ సమైక్యతను బలోపేతం చేయడంలో ఆయన పోషించిన పాత్ర చారిత్రాత్మకమని పేర్కొన్నారు. దేశం, ధర్మం, సంస్కృతి పరిరక్షణ కోసం ఆయన చూపిన మార్గం యువతకు ఆదర్శమని తెలిపారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బత్తుల నానాజీ, కంబాల యువసేన అధ్యక్షులు ఉంగరాల మణిరత్నం, కరిబండి వెంకటేశ్వరరావు, నాగ రమేష్, వీరాంజలి, దేశాల నరేష్, తుమ్మల బుజ్జి, పదిలం చక్రరావు, గనిరాజు, చింతల కన్నారావు, పద్దరాజు, పలకంశెట్టి శ్రీను, మండల సోషల్ మీడియా కన్వీనర్ ఆదం మణికంఠ, దుర్గారావు, జయరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *