స్వస్తి శ్రీ పరా భ వ నామ సంవత్సరం2026 మే 31.05..2026 ఆదివారం జ్యేష్ట పౌర్ణమి సందర్భంగా గాండ్ల పల్లె శ్రీ శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో అత్యంత వైభవో పే త 0 గా ప్రత్యేక పూజలు నిర్వహించారు

* శ్రీరామ రా మే తి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రా మ నామ వర ననే * గాండ్ల పల్లె వాసి ప్రముఖ పారిశ్రామికవేత్త వి. గిరినాథ్ ప్రకాష్ ఆయన సతీమణి జ్యోతి రాణి వి. రమణయ్య ఆయన సతీమణి గాయత్రీ దేవి ఆధ్వర్యంలో మరియు వారి కుటుంబ సభ్యులు సరస్వతి సుబ్రమణ్యంఆధ్వర్యంలో స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు * జె. వెంకటరమణ అర్చకత్వమున వైభవంగా పూజా కార్యక్రమాలు స్వామివారికి నిర్వహించారు *భక్తుల సౌకర్యార్థం కోసం సాయంత్రం 6 గంటల నుండిరాత్రి 10గంటల వరకు మహా అన్నదాన కార్యక్రమం జరిగింది __శుభ ఆదివారం జేష్ట పౌర్ణమి సందర్భంగా గాండ్ల పల్లె ప్రజలందరికీ సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో తులతూగాలని లోకం సుభిక్షంగా ఉండాలని భక్తాదులు శ్రీ అంజన్న ను వేడుకున్నారు

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ 1.06.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) చౌడేపల్లి మండలంలోని దుర్గ సముద్రం పంచాయతీ గాండ్లపల్లి గ్రామంలో విరాజిల్లుతున్న భక్తులుకోరిన కోరికలు తీర్చే ఘనమైన చరిత్ర కలిగిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో వి గిరి నాథ్ ప్రకాష్ ధర్మ పత్ని జ్యోతి రాణి. వి రమణయ్య ధర్మపత్ని గాయత్రీ దేవి సమ క్ష 0 లో స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు ఆలయం లోపల ఉదయం 6 గంటలకు నీటితో శుద్ధపరిచి గడపలకు గుమ్మాలకు పసుపు కుంకుమ సింధూరంతో బొట్లు పెట్టి మామిడి ఆకుల తోరణాలు కట్టి స్వామి వారి విగ్రహాన్ని నీట తోి శుద్ధపరిచి పసుపు కుంకుమ సింధూరంతో బొట్లు పెట్టి ప్రత్యేకమైన రంగురంగుల పూలతో అలంకరించి పూల మాలలు వేసి ఉదయం స్వామివారికి ఆరాధనతో మొదలై విశేషమైనటువంటి పంచామృత అభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది తదనంతరం స్వామివారికి రంగురంగులదళాలతో అర్చనాధి కార్యక్రమం జరిపించి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకున్నారు తదనంతరం తీర్థ ప్రసాదములు వినియోగం జరిగింది సాయంత్రం స్వామివారి యొక్క అష్టోత్తర నామాలతో స్వామివారికి అర్చనాది కైంకర్యాలు త దనంతరం మంత్రపుష్పాలతో జన సంద్రో హం మధ్య స్వామి వారి యొక్క విశేషమైనటువంటి జేష్ఠ పౌర్ణమి అన్నదానంతో సంపూర్ణమైనది ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ శ్రీ అభయ అభయాంజనేయ స్వామి ఎంతో శక్తివంతుడని భక్తులు కోరిన కోరికలు తీర్చే ఇష్ట దైవమని అన్నారు ఆయనకు తమలపాకుల దండ సింధూరం సమర్పించిన భక్తులకు ఎలాంటి కష్టాలు దరిచేరవని భక్తుల విశ్వాసంఅలాంటి స్వామివారి సేవలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని భక్తులు అన్నారు జై హనుమాన్ జై శ్రీరామ్ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందాఅంటూ గోవింద నామస్మరణలతో ఆలయంలోపల భక్తులు నినాదాలతో ఆలయం కిటకిటలాడింది సాయంత్రం వ డ మాలలుస్వామివారికి వేసి ఇష్టమైన తమలపాకులతో ఆకు పూజ చేసిభక్తిశ్రద్ధలతో చేశారు భక్తులు హనుమంతునికి తమలపాకులను ఎందుకు సమర్పిస్తారో తెలుసా? హనుమంతుడు లంకలోకి వెళ్ళినప్పుడు రావణుని సైన్యం హనుమంతు న్ని పట్టుకొని ఆయన తోకకు నిప్పు అంటించారు కోపంతో హనుమంతుడు లంక నగరాన్ని మొత్తం తగలబెట్టారు కానీ ఈ క్రమంలో హనుమంతుడి శరీరానికి కూడా గాయాలైనాయి గాయపడిన హనుమంతు న్ని చూసి శ్రీరాముడు చాలా బాధపడ్డారు శ్రీరాముడు హనుమంతున్ని తన ప్రక్కన కూర్చోబెట్టుకుని ప్రేమగా అతని గాయాలపై తమలపాకులను పెట్టాడు ఆ తమలపాకులకు గాయాలు నయం చేసే గుణాలు ఉండటమే కాకుండా అవి ప్రేమ మరియు ఆప్యాయతతో నిండి ఉన్నాయి. హనుమంతు న్ని ఆ తమలపాకులు తగలగానే హనుమంతుడు గాయాలు నయమైనాయి అప్పటినుండి హనుమంతునికి తమలపాకులు అంటే చాలా ఇష్టం ఏర్పడింది హనుమంతుడు జాంబవంతునితో ఇలా అన్నాడు తమలపాకులతో నన్ను పూజించే వారికి నా ఆశీస్సులు ర క్ష న లభిస్తాయి అని చెప్పారు అందుకే భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో శ్రీ హనుమంతునికి తమలపాకులను సమర్పిస్తారు జైశ్రీరామ్ సాయంత్రం7గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పెద్ద ఎత్తున వందలాది మందిభక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమం జరిగిందిఈ కార్యక్రమాలన్నీ వి.గిరినాథ్ ప్రకాష్ ఆధ్వర్యంలో ఆయన ఇచ్చే ఆర్థిక సహాయంతో అన్ని కార్యక్రమాలు జరుగుతాయి ఈ శుభ జేష్ట పౌర్ణమిఆదివారం సందర్భంగా గాండ్ల పల్లె ప్రజలందరికీ సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో తులతూగాలని లోకం సుభిక్షంగా ఉండాలని భక్తాదులు శ్రీ అంజన్నను వేడుకున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *