హాకీ టోర్నమెంట్ ప్రారంభించిన గూడూరు మున్సిపల్ కమీషనర్

పయనించే సూర్యుడు గూడూరు న్యూస్ మే 30 గూడూరు లోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో శుక్రవారం, గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే కప్ 2026 లో భాగంగా హాకీ టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే స్నేహితుల ఆధ్వర్యంలో జరుగుతున్న ,ఎమ్మెల్యే కప్ 2026 ను మొదటి రోజు మన జాతీయ క్రీడ హాకీ తో ప్రారంభించడం మంచి పరిణామమని ,ఎమ్మెల్యే స్టేడియంలో చేసిన అభివృద్ధికి కృతజ్ఞతగా వారి స్నేహితులందరూ ఐదు రోజులపాటు క్రీడా పోటీలు నిర్వహించడం ఒక శుభ పరిణామం, ప్రత్యేకమైనదని అన్నారు.ఎమ్మెల్యే మీద వారికున్న అభిమానాన్ని, గౌరవాన్ని తెలుపుతుందన్నారు అదేవిధంగా క్రీడాకారులందరూ క్రమశిక్షణతో ఆడాలని, ఎమ్మెల్యే మనందరి కోసం అభివృద్ధి చేసిన ఈ స్టేడియాన్ని అందరం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని తెలిపారు. స్నేహితులు జరిపే కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామిని చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వేగూరు రాజేంద్రప్రసాద్, రజనీకాంత్, శనగ మస్తాన్, ఇబ్రహీం, సుమన్ రెడ్డి ,విజయ్ కుమార్, సుబ్రహ్మణ్యం, అరుణ్ కుమార్, హాకీ కోచ్ దీపక్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *