పయనించే సూర్యుడు జులై 08 ఆదిలాబాద్ జిల్లా మండలం ఉట్నూర్ ఉట్నూర్ ప్రతినిధి: ఉట్నూర్ మండల కేంద్రంలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించనున్న వేస్ట్ ప్లాస్టిక్ మేనేజ్‌మెంట్ షెడ్‌కు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ భూమిపూజ నిర్వహించి టెంకాయ కొట్టి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్థాలను సైతం ఉపయోగపడేలా మార్చే ఆధునిక యంత్రాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని వాటిని సమర్థవంతంగా వినియోగించడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి మండలానికి ఒక్కో వేస్ట్ ప్లాస్టిక్ మేనేజ్‌మెంట్ యూనిట్‌ను కేటాయించినట్లు వెల్లడించారు అనంతరం కాంట్రాక్టర్ సయ్యద్ ఇక్బాల్ ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు నిర్మాణ పనులను నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులకు కాంట్రాక్టర్‌కు సూచించారు ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు ఉట్నూర్ లక్కారం గ్రామాల సర్పంచులు వార్డు సభ్యులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.