హరీష్ రావు అరెస్టు ప్రజాస్వామ్యంపై దాడి – సింగరేణి మండల యువజన నాయకుడు జడల కళ్యాణ్ ఆగ్రహం

పయనించే సూర్యుడు న్యూస్ జులై 3 సింగరేణి రిపోర్టర్ నరేష్ సింగరేణి, జూలై 2: సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని ఖమ్మం జిల్లా సింగరేణి మండల యువజన నాయకుడు జడల కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష నాయకులపై అక్రమ అరెస్టులు, నిర్బంధాలు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జడల కళ్యాణ్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న నాయకులను రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా లక్ష్యంగా చేసుకోవడం దురదృష్టకరమన్నా రు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి రాజకీయ పార్టీకి, నాయకుడికి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచే హక్కు ఉందని, ఆ హక్కులను కాలరాయడం రాజ్యాంగ విలువలను దెబ్బతీయడమేనని అన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదని, హరీష్ రావును వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భారత రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేయడం, నిర్బంధాలకు పాల్పడటం మానుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు యువత ముందుకు రావాలని, ప్రజా హక్కుల కోసం జరిగే పోరాటాలకు అండగా నిలవాలని జడల కళ్యాణ్ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *