శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో గాయత్రి హోమం

పూజా కార్యక్రమాలను నిర్వహించిన పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు

పయనించే సూర్యుడు, జూన్ 13,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భూర్గంపహాడ్ శిశు మందిర్ పాఠశాలలో వేసవి సెలవులు తర్వాత పాఠశాలను తిరిగి తెరిచి, కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించే   సందర్భంగా, మొదటగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేసి అనంతరం గాయత్రి హోమం నిర్వహించారు. విద్యార్థుల విద్యాభ్యాసం, విజయవంతంగా కొనసాగాలని, జ్ఞానదాయిని శ్రీ సరస్వతీ మాత ఆశీస్సులు లభించాలని, ఆకాంక్షిస్తూ పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా శుక్రవారం ఉదయం 9:00 గంటలకు శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాల ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన, గాయత్రీ హోమం, శ్రీ సరస్వతీ మాత పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమం ను, గాయత్రి హోమంను పాఠశాల అధ్యక్షులు ముత్తవరపు రాజశేఖర్, భవానీ దంపతులచే, పురోహితులు ఓరుగంటి సురేష్ కుమార్ వేద మంత్రాల నడుమ నిర్వహించారు. పాఠశాలకు, పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు, కమిటీ వారికి, ఆచార్య బృందం కు, అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ను నిర్వహించాము అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దిగవల్లి రాజేశ్వరరావు (ఐటీసీ రిటైర్డ్ ఎంప్లాయీ), పాఠశాల అధ్యక్షులు ముత్తవరపు రాజశేఖర్, వై. వెంకటేశ్వర్లు (బియంయస్), యలగల కామేశ్వరరావు, పాఠశాల కోశాధికారి పొదిలి హిమవంతు, గోవర్ధన్, ప్రమీల, ఓరుగంటి సురేష్ కుమార్, తాయారమ్మ, ప్రధాన ఆచార్యులు, ఆచార్య బృందం, అలాగే తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *