పయనించే సూర్యడు పత్రిక జూలై 03 గోకవరం మండల రిపోర్టర్ దొరబాబు: కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ది పీఎంపీ అసోసియేషన్) తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం ఆధ్వర్యంలో గోకవరం పీహెచ్సీ నందు జిల్లా కోశాధికారి, మండల అధ్యక్షులు పీ చిన్ని అధ్యక్షతన జూలై 1వ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవం(డాక్టర్స్ డే) సందర్భంగా ఆసుపత్రి వైద్యాధికారులు డాక్టర్ ఎల్ రామలక్ష్మి సీఏఎస్, డాక్టర్ వి భాగ్యశ్రీ సీఏఎస్,డాక్టర్ కె మధు సీఏఎస్,డాక్టర్ వైషాలి సీఏఎస్,డాక్టర్ ఘాన్సీరాణి సీఏఎస్,డాక్టర్ జి గంగాధర్ సీఏఎస్,డాక్టర్ ఎమ్ హరిష్మ చౌదరి సీఏఎస్ లను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ వైద్య రంగంలో ఎనలేని సేవలందించిన డాక్టర్ బీసీ రాయ్ జయంతి, వర్ధంతి జులై 1వతేదీ కావడంతో ఈ రోజు దేశమంతా ఆయన జ్ఞాపకార్దం డాక్టర్స్ డే జరుపుకుంటున్నామని తెలిపారు,జిల్లా కోశాధికారి పి చిన్ని మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు ఎనలేని సేవలందిస్తున్న వైద్య గురువులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ఎస్ సూరిబాబు,కోశాధికారి గున్నురి లాజర్,ఉపాధ్యక్షులు ఎమ్ నాగేశ్వరరావు,సహాయ కార్యదర్శి జి వెంకటేష్,గౌరవ సలహాదారు సీహెచ్ విశ్వేశ్వరరావు,ఎమ్ దుర్గారావు, కె వరప్రసాద్, గోకవరం గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మెంబర్ రాయవరపు శ్రీనివాసరావు గారు, తదితరులు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.