మియాపూర్ సర్కిల్‌లో సార్-2026 ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, ఆన్‌లైన్ అప్‌డేషన్ ప్రక్రియ పరిశీలననారాయణ్ అమిత్ ఐఏఎస్

పయనించే సూర్యుడు, జూలై 03 రంగారెడ్డిప్రతినిధి ఎస్ఎంకుమార్ సార్-2026 ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ మరియు ఆన్‌లైన్ అప్‌డేషన్ ప్రక్రియ పురోగతిని సమీక్షించేందుకు నేడు మియాపూర్ సర్కిల్‌లో పర్య టించి, క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. ఈ సందర్భంగా క్షేత్ర సిబ్బందితో మాట్లా డి, ఫారాల పంపిణీ ప్రక్రియను వేగవం తం చేయాలని ఆదేశించారు.పంపిణీ లో ఖచ్చితత్వం పాటిస్తూ, నిర్ణీత గడువులోగా పనిని పూర్తి చేయా లని సూచించారు. లక్ష్యాలను సకాలంలో సాధించేందుకు విభాగాల మధ్య సమర్థవంతమైన సమన్వయం, అంకితభావంతో కృషి చేయడం ఎంతో అవసరమని నొక్కిచె ప్పారు. ఆన్‌లైన్ అప్‌డేషన్‌లో ఎలాంటి జాప్యం లేకుండా, పూర్తి పారదర్శకతతో ప్రక్రియను నిర్వహించా లని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.ఈ సందర్బంగా ముక్తా మహ బూబ్ పేట్, మయూరిన గర్, హఫీజ్ పేట్ ఏరియాస్ ను సందర్శించారు సార్-2026 ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ప్రతి దశలోనూ నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికా రులకు, సిబ్బందికి సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *