పయనించే సూర్యుడు, జులై 4, బిజినపల్లి రిపోర్టర్ (శ్రావణ్ కుమార్): బిజినపల్లి మండలం వెల్గొండ గ్రామానికి చెందిన రామ్‌రెడ్డి అనారోగ్యంతో బాధపడుతుండగా, ఆయన చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా రూ.6 లక్షల విలువైన ఎల్ఓసీని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మంజూరు చేయించారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామ్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ఎల్ఓసీని అందజేశారు. ఈ సందర్భంగా పేదలకు వైద్య చికిత్స కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులిదండ నాగేష్ యూత్ నాయకులు భరత్ రాజ్ గౌడ్ అలాగే సహాయం అందించిన ఎమ్మెల్యేకు రామ్‌రెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.