మహిళా సంక్షేమం, సాధికారతకు కేంద్రం పెద్దపీట : బండిమహిళల స్వావలంభనే సర్కార్ ధ్యేయం : డాక్టర్ కవ్వంపల్లి

పయనించే సూర్యుడు న్యూస్ :జులై /04:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం :కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కవ్వం పెల్లి సత్యనారాయణ మహిళా సంక్షేమం, ఆర్థికాభివృద్ధి సాధికారతకు మోదీ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. శుక్రవారం ఎల్ఎండీ కాలనీలోని మహిళా ప్రాంగణంలో కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ మహిళా సంక్షేమానికి కేంద్రం పాటుపడుతోందని, ఉజ్వల పథకంలో భాగంగా 11 కోట్ల గ్యాస్ కనెక్షన్లు మహిళలకు ఇచ్చామని చెప్పారు. త్వరలో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు తీసుకు వస్తామన్నారు. స్వయం ఉపాధి అవకాశాల కల్పనలో భాగంగా మహిళలకు విడుతల వారీగా ఆటోలు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు కేంద్ర మంత్రి చెప్పారు. గూడ్స్ ఆటోలు మన కరీంనగర్ లో మాత్రమే నడుస్తున్నాయని, వీటికి మరింత డిమాండ్ పెరిగే అవకాశాలున్నాయన్నారు. అన్నిరంగాల్లో మహిళలను ప్రోత్సహించే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. ఏ ప్రభుత్వమైనా ప్రజలకు మంచి చేయాలని చూస్తుందని, అయితే గత పాలకులు మాత్రం ఇందుకు భిన్నంగా పని చేశారని, గత పాలకులకు మహిళలను ప్రోత్సహించాలన్న సోయి లేకుండా పోయిందన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 20 వేల మంది విద్యార్థులకు సైకిళ్లు కొని ఇవ్వడమే కాకుండా పదో తరగతి చదివిన విద్యార్థులకు పరీక్ష ఫీజులు కట్టిన విషయాన్ని బండి సంజయ్ కుమార్ గుర్తు చేశారు. మహిళల స్వావలంభనే సర్కార్ ధ్యేయం : డాక్టర్ కవ్వంపల్లి ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ఎవరిపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించేలా మహిళలను తీర్చిదద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయాలనే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని చెప్పారు. మహిళా సంఘాలకు రూ.10లక్షల రుణంతో పాటు ఇన్సూరెన్స్ కల్పిస్తున్నామని డాక్టర్ కవ్వంపల్లి చెప్పారు. మహిళల్లో కష్టపడే తత్వం మెండుగా ఉండటం వల్ల ప్రభుత్వ పథకాలతో వారు సత్ఫలితాలను సాధిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు,కార్యక్రమాలన్నీ మహిళా ప్రాంగణం ద్వారా ప్రవేశపెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.మహిళలను బలోపేతం చేసేలా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అందిస్తున్న సహాయం, చేస్తున్న కృషి ఎంతో గొప్పదని డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *