స్వర్గీయ కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా ఘన నివాళులు

పయనించే సూర్యుడు న్యూస్ | జూలై 5 | సింగరేణి రిపోర్టర్ నరేష్ సింగరేణి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రజాహిత పాలనకు మారుపేరుగా నిలిచిన కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా సింగరేణి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సింగరేణి గ్రామపంచాయతీ సర్పంచ్ మేదరి వీర ప్రతాప్ (టోనీ) మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శక పరిపాలనకు రోశయ్య చూపిన మార్గం నేటి తరానికి ఆదర్శప్రాయమన్నారు. ప్రజల కోసం నిజాయితీ, నిబద్ధతతో జీవితాంతం సేవ చేసిన మహానేతగా ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు. అలాగే ఆయన ఆశయాలు, విలువలు ప్రతి ప్రజాప్రతినిధికి స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షిస్తూ రోశయ్యకు వినమ్ర నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ప్రజాప్రతినిధులు, సిబ్బంది, గ్రామ పెద్దలు, నాయకులు పాల్గొని రోశయ్య సేవలను స్మరించుకున్నారు. స్వర్గీయ కొణిజేటి రోశయ్య గారికి ఘన నివాళులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *