శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ ఘనంగా నిర్వహింపు

పాపన్నపేట మండలంలోని నా మా పురం గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి శనివారం భక్తిశ్రద్ధల నడుమ భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజల ఎన్నో ఏళ్ల ఆకాంక్ష అయిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి నాంది పలుకుతూ వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు.

పయనించే సూర్యుడు జూలై 5. పాపన్నపేట మండల రిపోర్టర్ దుర్గాప్రసాద్ ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి సబితా–దశరథం దంపతులు, ఉప సర్పంచ్, బాలరాజు వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ నిర్మాణం ఎలాంటి ఆటంకాలు లేకుండా త్వరగా పూర్తై, గ్రామ ప్రజలకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలవాలని శ్రీ సీతారామచంద్ర స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గ్రామ పెద్దలు మాట్లాడుతూ, ఆలయ నిర్మాణం పూర్తయిన అనంతరం నిత్య పూజలు, ధార్మిక కార్యక్రమాలు, పండుగలను వైభవంగా నిర్వహించేలా గ్రామస్థులంతా కలిసి కృషి చేస్తామని తెలిపారు. గ్రామాభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక అభివృద్ధికి కూడా ఈ ఆలయం దోహదపడుతుందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో భక్తిమయ వాతావరణం నెలకొంది. జై శ్రీరామ్ నినాదాలతో గ్రామమంతా మార్మోగగా, భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా సహకరిస్తూ ఆలయ నిర్మాణాన్ని విజయవంతం చేయాలని సంకల్పించారు. కార్యక్రమం అనంతరం పాల్గొన్న భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

.

జై శ్రీరామ్! జై జై శ్రీరామ్!

.


శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *