హైదరాబాద్ లో సామల శ్రీనివాస్ ను పరామర్శించిన కవ్వంపల్లి

పయనించే సూర్యుడు న్యూస్ : 30:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం :కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ,హైదరాబాద్- పంజాగుట్టలోని సువిధ హాస్పిటల్ రీహాబిలిటేషన్ సెంటర్ లో చికిత్స పొందుతున్న శంకరపట్నం మండల కేంద్రానికి చెందిన సామల శ్రీనివాస్ ను శుక్రవారం మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మెన్, డాక్టర్ సెల్ అడ్వయిజర్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పరామర్శించారు. ఇటీవల విధులు ముగించుకొని బైక్ పై ఎరడపల్లి మీదుగా కేశవపట్నం వెళుతుండగా జరిగిన ప్రమాదంలో శ్రీనివాస్ తలకు తీవ్ర గాయాలై హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ కు సంబంధించిన వైద్య నివేదికలను ఆయన పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట పీసీసీ సభ్యుడు, మాజీ జెడ్పీసీ బత్తిని శ్రీనివాస్, శంకరపట్నం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి తిరుపతి, హనుమంతు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *