ప్రతిభా నోబెల్ అవార్డు అందుకున్న డాక్టర్ పత్తిపాటి లక్ష్మికాంతమ్మ

పయనించే సూర్యుడు మే 26, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు) చింతకాని : తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో వల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో డాక్టర్ పత్తిపాటి లక్ష్మికాంతమ్మకు “ప్రతిభా నోబెల్ అవార్డు” ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి వల్లూరి ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ వి.ఆర్. శ్రీనివాసరాజు అధ్యక్షత వహించారు. సమాజ సేవలో విశేష కృషి చేస్తున్న డాక్టర్ లక్ష్మికాంతమ్మ సేవలను గుర్తించి ఈ అవార్డును అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడిన మహిళలు, యువతీ యువకులు, వృద్ధులు మరియు పురుషుల అభ్యున్నతికి ఆమె చేస్తున్న సేవలు ప్రశంసనీయమని సభలో పలువురు కొనియాడారు. ఆర్థికంగా వెనుకబడిన మహిళలను స్వయం సమృద్ధి దిశగా నడిపించేందుకు నెలకు రూ.200 పొదుపు పథకం అమలు చేస్తూ, సుమారు 250 మంది మహిళలతో పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి వారి కుటుంబాల్లో ఆర్థిక వెలుగులు నింపుతున్నారని తెలిపారు. అదేవిధంగా యువతకు చేయూతనిస్తూ, వృద్ధులకు దుస్తుల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే దైవాజ్ఞ శర్మ, తమిళ్-తెలుగు సినీ నటుడు కిరణ్ కుమార్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పత్తిపాటి లక్ష్మికాంతమ్మ మాట్లాడుతూ, ప్రముఖుల సమక్షంలో ప్రతిభా నోబెల్ అవార్డు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ అవార్డు తనకు మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో కూడా సమాజ సేవను మరింత విస్తృతంగా కొనసాగిస్తానని తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *