వత్సవాయి మండల ప్రజా పరిషత్‌లో నూతన ఎంపీడీవోగా పదవి బాధ్యతలు స్వీకరించిన బి రాజు

పయనించే సూర్యుడు వాత్సవాయి మండలం రిపోర్టర్ తమ్మిశెట్టి వెంకట్రావు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జులై 5 వత్సవాయి గ్రామంలో ని ఈరోజు న వత్సవాయి మండల ప్రజా పరిషత్‌లో నూతన ఎంపీడీవోగా బి. రాజు బాధ్యతల స్వీకరణ ఎన్టీఆర్ జిల్లా, వత్సవాయి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతన మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)గా బి. రాజు నేడు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండల ప్రజా పరిషత్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు బి. రాజు I పుష్పగుచ్ఛాలు అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బి. రాజు మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు సమర్థవంతంగా అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. మండలంలోని అన్ని శాఖల అధికారులతో సమన్వయంగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడం తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *