పయనించే సూర్యుడు జులై 5 ఆదోని రూరల్ రిపోర్టర్. గోటు విలేజ్ బసాపురం గ్రామం ఆదోని మండలం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందా కృష్ణ మాదిగ ఆదేశాలు మేరకు మరియు కర్నూలు జిల్లా ఇన్చార్జులు దమ్ము చిన్న వెంకటేశ్వరులు మాదిగ పులిగొట్ల గోపి మాదిగ సూచనలతో ఈరోజు బసాపురం గ్రామంలో గో టు విలేజ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడినది ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ టౌన్ ఇంచార్జ్ మా దాస్ జగన్నాథ్ మరియు టౌన్ మాజీ అధికార ప్రతినిధినరసింహ, టౌన్ మాజీ కార్యదర్శి మొగతాళి విజయరాజు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ టౌన్ ఇంచార్జ్ మాదాస్ జగన్నాథ్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ఫలాలు నిజంగా మాదిగలకు అందాలంటే విద్య ఒక్కటే ప్రధాన ఆయుధం బలమైన ఆధారం మాదిగ పల్లెలోని ప్రతి బిడ్డ ఐదు సంవత్సరాలు నిండగానే పాఠశాలలో చేర్పించాలని పిలుపునిచ్చారు అలాగే 10 వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు పాలిటెక్నిక్ అగ్రికల్చర్ హార్టికల్చర్ వంటి డిప్లమా కోర్సులు చేరి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. ఇంటర్మీడియట్లో ఎంపీసీ బి.ఐ.పి.సి హెచ్ ఈ సి వంటి గ్రూపులను ఎంచుకొని ఉన్నత విద్య వైపు అడుగులు వేయాలని మన పిల్లల చదువు ఇంటర్మీడియట్ తో ఆగిపోకుండా డిగ్రీలు,పీజీలు, ఎంఫీల్, పీహెచ్డీ, వరకు కొనసాగించాలని ప్రేరణ నిచ్చారు. వివిధ రకాల ఎంట్రన్స్ పరీక్షలో కష్టపడి చదివి తమ ప్రతిభను చాటాలని యువతకు అలాగే ఎమ్మార్పీఎస్ జెండాను జులై 7న జండా దిమ్మను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విజయ్ రాజు, నరసింహ, ప్రహ్లాద్, ప్రకాష్, ఉరుకుందు, బసాపురం గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.