పయనించే సూర్యుడు దస్తగిరి రిపోర్టర్ న్యూస్ 5–7–2026 :ప్రభాకర్ కురుమ జుక్కల్ శివారులో దొడ్డి కొమురయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు హాజరైన కురుమ సంఘం నాయకులు తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 80వ వర్ధంతిని పురస్కరించుకుని నారాయణఖేడ్ మండలం జుక్కల్ శివారులో ఉన్న ఆయన విగ్రహానికి శనివారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం అధ్యక్షులు ప్రభాకర్, అధ్యక్షులు అంజన్న, జిల్లా నాయకుడు మల్గొండ, మరియు బీజేపీ నారాయణఖేడ్ మండల అధ్యక్షులు సిందోల్ దశరథ్ పాల్గొని దొడ్డి కొమురయ్య చిత్రపటానికి, విగ్రహానికి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నిజాం నిరంకుశ పాలనకు, భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య చేసిన త్యాగం చిరస్మరణీయమైనదని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం, ప్రాణాలర్పించిన కొమురయ్య పోరాట పటిమ నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని, బహుజనుల హక్కుల రక్షణే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కురుమ సంఘం ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమరుడు దొడ్డి కొమురయ్యకు జేజేలు పలికారు. నారాయణఖేడ్ నియోజకవర్గ కురుమ సంఘం నాయకులు ఉపసర్పంచ్ భీమన్నా, తుకరం, తుకరం, సాయిగొండ, తదితరులు మరియు పలు పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.