ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి : తపస్చేగుంట

పయనించే సూర్యుడు న్యూస్ 5 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు తపస్ చేగుంట మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రావుల వెంకటేష్, తంగెళ్లపల్లి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కొరకు చేగుంట తాసిల్దార్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చల్లా లక్ష్మణ్ , మండల అధ్యక్షుడు రావుల వెంకటేష్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న డి ఏ లను విడుదల చేయాలని , పిఆర్సి రిపోర్టు తెప్పించుకొని వెంటనే అమలు చేయాలని, సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ అమలు చేయాలి అని, సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మె కాలపు ఒక నెల వేతనాన్ని వెంటనే విడుదల చేయాలని, పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 0 1 0 పద్దు కింద వేతనాలు విడుదల చేయాలి అని,జీఓ 317 నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాలని, గురుకుల, కేజీబీవీ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని, ప్రతి సంవత్సరం పదోన్నతులు చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు బాలిశెట్టి రేఖ, కార్యవర్గ సభ్యులు పట్లూరి యాదగిరి, దేశపతి కృష్ణమూర్తి,సుమతి, , మండల ఉపాధ్యక్షులు మధునాల శ్రీనివాస్ మండల కోశాధికారి శ్రీనివాస్, కాంప్లెక్స్ కన్వీనర్ చరణ్ దాస్, కాంప్లెక్స్ కో కన్వీనర్ విజయలత మండల సభ్యులు బక్కప్ప, సరస్వతి, సంధ్యారాణి, సంగీత, మౌనిక,ప్రభాకర్ రెడ్డి శివకుమార్, ఉమాదేవి ఉపాధ్యాయులు రఘుపతి, రమాదేవి, శారద, రమ, ఉమామహేశ్వరి, కరుణ, సునీత, సునీత హెలెన్,వినోద, నరసింహ చారి, కిషన్, నాగరాజు,మౌనిక, సుమలత, ఊర్మిళ, సి అర్ పి రమేష్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *