పయనిం చే సూర్యుడు..05 .పాగర్తి సుధాకర్ భారతీయ జనతా పార్టీ నేలకొండపల్లి మండల అధ్యక్షులు పాగర్తి సుధాకర్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద వర్ధంతి ఆయన చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివ్వాళ్ళు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా పాగర్తి సుధాకర్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన ఆ యుగపురుషుడు స్వామి వివేకానంద అని అన్నారు, ఆయన “రామకృష్ణ మిషన్” ను స్థాపించి దీని ద్వారా విద్య, వైద్యం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యలు వంటి ఎన్నో సామాజిక సేవలను అందించడం ప్రారంభించారని,దీని ప్రధాన కార్యాలయం పశ్చిమ బెంగాల్లోని బేలూరు మఠంలో ఉందని అన్నారు, యువతను మేల్కొల్పడానికి ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ ఎందరికో స్ఫూర్తిదాయకం గమ్యం చేరేవరకువిశ్రమించకు నువ్వు ఏది అనుకుంటే అది అవుతావు. నిన్ను నువ్వు బలహీనుడివి అనుకుంటే బలహీనుడివి అవుతావు, బలవంతుడివి అనుకుంటే బలవంతుడివి అవుతావని యువత ఉద్దేశించి అన్నారని, మానవ సేవయే మాధవ సేవ అని ఆయన గట్టిగా నమ్మారని అన్నారు ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు షేక్ షర్ఫుద్దీన్,సూరెపల్లి జ్ఞానరత్నం, సయ్యద్ మోహినూద్దీన్, తేజవత్ నాగరాజు,బానోత్ శ్రీనివాస రావు, తేజవత్ హనుమంత్, మూడు రమేష్, తేజవత్ గోపి, తేజవత్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు