వంగవీటి మోహనరంగా జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు జూలై 6 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం : దివంగత ప్రజానాయకుడు వంగవీటి మోహనరంగా 79వ జయంతి సందర్భంగా రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రామచంద్రపురంలోని వంగవీటి మోహనరంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతరం పోరాడిన ధైర్యవంతుడైన నాయకుడు వంగవీటి మోహనరంగా అని అన్నారు. సామాన్య ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆయన చేసిన సేవలు నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ప్రజల పట్ల అంకితభావం, నిబద్ధత, సేవా తపన కలిగిన నాయకుడిగా ఆయన పేరు చిరకాలం గుర్తుండిపోతుందని అన్నారు. యువత సమాజ సేవలో ముందుండి ప్రజల కోసం పని చేయాలనే స్ఫూర్తిని ఆయన జీవితం ఇస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు అక్కల రిశ్వంత్ రాయ్, జనసేన ఇంచార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, వంగవీటి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *