భారత దేశ ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన మహావ్యక్తి వివేకానందుడు: కసిరెడ్డి భాస్కర్ రెడ్డి

పయనించే సూర్యుడు, జూలై 6 రంగారెడ్డి జిల్లా ప్రతినిధిఎస్ఎంకుమార్ భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన వివేకానందుడికి మనం నివాళులు అర్పించడం మన అదృష్టంగా భావిద్దాం – కసిరెడ్డి భాస్కరరెడ్డి భారతదేశ గొప్పదనాన్ని విదేశాల్లో వినిపించి, దేశ ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన మహనీయుడు స్వామీ వివేకానంద ‘వర్ధంతి’ నాడు ఆయనకు నివాళులు అర్పించడం మన అదృష్టంగా భావించాలని బిజెపి రాష్ట్ర నాయకులు, గౌతమీనగర్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ముఖ్య సలహాదారుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు.వివేకానం ద వర్ధంతి సందర్భంగా గౌతమీనగర్ కాలనీ మున్సిపల్ పార్కు వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తదనంతరం ఆయన మాట్లా డుతూ… వివేకానందుడు చెప్పినట్టు దృఢమైన శారీరక దారుఢ్యంతో యువత ఉన్నప్పుడే దేశం దృఢంగా ఉంటుందని, యువత ఆయన మార్గం లో పయనించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వివేకానంద ఆశయా లను అనుసరిస్తామని పెద్ద పెట్టున నినదించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు అశోక్ కుమార్, మురళీధర్, దామోదర్ గౌడ్, నూ కల లక్ష్మణ్, నర్సింహ, రామస్వామి, పాండురంగాచారి, రవీందర్ రెడ్డి, నాయర్, వినాయక్ రెడ్డి, తనవ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *