బొగ్గవరపు వెంకటేశ్వర్లు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో లక్ష్మీ ఫౌండేషన్ హాస్పిటల్ వారిచే ఉచిత వైద్య శిబిరం నిర్వహణ

పయనించే సూర్యుడు వాత్సవాయి మండలం రిపోర్టర్ తమ్మిశెట్టి వెంకట్రావు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జులై 7 వత్సవాయి లోని బొగ్గవరపు వెంకటేశ్వర్లు విజ్ఞాన కేంద్రం నందు ఆదివారం విజయవాడకు చెందిన లక్ష్మీ ఫౌండేషన్ హాస్పిటల్ వారిచే ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ప్రముఖ వైద్యులు డాక్టర్ పులిపాటి చంద్రశేఖర రావు శిబిరాన్ని ప్రారంభించారు .ఆవాంటెల్ సంస్థ వ్యవస్థాపకులు విద్యాసాగర్ , తన తల్లి లక్ష్మీ స్మారకార్థంగా స్థాపించిన లక్ష్మీ ఫౌండేషన్ ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటు ధరల్లో అందించాలనే లక్ష్యంతో ప్రస్తుతం విజయవాడలో వైద్య సేవలందిస్తున్నారు. నోవాటెల్ హోటల్ ఎదురుగా, సెంటిని హాస్పిటల్ పక్కన ఉన్న లక్ష్మీ ఫౌండేషన్ హాస్పిటల్‌ లో ప్రస్తుతం ఓ. పి , తక్కువ ధరలతో ఐ.పి, శస్త్రచికిత్సలు మరియు ఇతర వైద్య సేవలు అనుభవజ్ఞులైన వైద్యులచే అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో లక్ష్మీ ఫౌండేషన్ హాస్పిటల్ వారు తమ వైద్య సేవలను జిల్లాలో విస్తృత పరచడం కోసం గాను సేవా కార్యక్రమంలో భాగంగా వత్సవాయి లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వత్సవాయి మరియు పరిసర గ్రామాల ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకొన్నారు.ఈ శిబిరంలో జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఎలమంచిలి పూజిత, ఎముకలు, కీళ్ల వ్యాధి నిపుణులు డాక్టర్ పత్తిపాటి వినయ్, శ్వాసకోశ వ్యాధి నిపుణులు డాక్టర్ కామేపల్లి స్వాతి, జనరల్ మరియు లాప్రోస్కోపిక్ నిపుణులు డాక్టర్ డి. రవీంద్రబాబు, కంటి వ్యాధి నిపుణులు డాక్టర్ గుండపునేని రమ్య తదితరులు పాల్గొని తమ సేవలను అందించారు.. ఈ శిబిరం నందు ఉచితంగా షుగర్, బిపి, కంటి పరీక్ష, గుండెకు సంబంధించి 2 డి ఎకో పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో 250 మంది పాల్గొని వివిధ వైద్య పరీక్షలను నిర్వహింప చేసుకున్నారు. వైద్య పరీక్షలు అనంతరం ఉచితంగా మందులు, రీడింగ్ గ్లాసులు అందించారు. ఈ వైద్య శిబిరాన్ని గ్రామానికి చెందిన ప్రముఖ వైద్యులు పులిపాటి చంద్రశేఖర రావు ప్రారంభించగా బొగ్గవరపు వెంకటేశ్వర్లు విజ్ఞాన కేంద్ర ట్రస్ట్ చైర్మన్ చిరుమామిళ్ల హనుమంతరావు, లక్ష్మీ ఫౌండేషన్ హాస్పిటల్ కార్యనిర్వహణ అధికారి సత్యనారాయణ, కమిటీ సభ్యులు బి. రాము, కొంగర వెంకటేశ్వరరావు, వాసిరెడ్డి నరేంద్ర దేవ్, నరమనేని సుబ్బారావు, సాదినేని బాలయ్య, వి. రమ, కందుల కోటయ్య, కూరపాటి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరానికి పుట్టు శిక్షణలో పాల్గొన్న మహిళలు మౌనిక, కృష్ణవేణి, యామిని, స్వాతి తదితరులు వాలంటీర్ గా వ్యవహరించారు. ఈ శిబిరంలో పాల్గొన్న గ్రామస్తులు వారికి అందిన వైద్య సేవలు పట్ల తమ సంతృప్తిని వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *