పయనించే సూర్యుడు న్యూస్ మే 21 సాలూర : సాలూర మండలం హున్సా సొసైటీలో రైతులకు జిలుగు విత్తనాలు సొసైటీ చైర్మన్ సీఈఓ వ్యవసాయ శాఖ అధికారులు పంపిణీ చేశారు ఒక్కో బ్యాగ్ జీలుగు విత్తనం ధర రూ. 2453/-ఈ విత్తనాలు హున్సా, సాలంపాడ్ మరియు సాలుర సొసైటీలలో రైతులకు అందుబాటులో ఉంటాయని ప్రతి ఒక్క రైతులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ అవకాశాన్ని వినియోగించుకొని సబ్సిడీ ధరపై జీలుగు విత్తనాలనుపొందవలసిందిగా తెలిపారు పంట భూముల సారవంతత పెంపు, సేంద్రియ పదార్థాల శాతం వృద్ధి మరియు నేల ఆరోగ్య సంరక్షణలో జీలుగు పంట ఎంతో ఉపయోగకరమని అధికారులు వివరించారు. ముఖ్యంగా గ్రీన్ మ్యాన్యూర్ పంటగా జీలుగు సాగు చేయడం ద్వారా తదుపరి పంటలకు అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. కావున ఆసక్తి గల రైతులు సంబంధిత సొసైటీలను సంప్రదించి త్వరితగతిన విత్తనాలు పొందవలసిందిగా అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మందర్న రవి సొసైటీ సీఈవో అనిల్ పటేల్ వ్యసయ శాఖ అధికారులు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు