సాలుర సొసైటీలో జిలుగు విత్తనాలు పంపిణీ

* పంపిణీ చేసిన సొసైటీ చైర్మన్

పయనించె సూర్యుడు న్యూస్ మే 21 సాలుర : సాలూరు మండలం సాలూరు గ్రామ సొసైటీలో జిలుగు విత్తనాలు సొసైటీ చైర్మన్ ఇంచార్జ్ కార్యదర్శి బుధవారం రైతులకు పంపిణీ చేశారు సాలూర సహకార సంఘం ఆధ్వర్యంలో సంఘ అధ్యక్షులు అల్లె జనార్ధన్ జిలుగు విత్తనాలను పంపిణీ చేయడం జరిగింది . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సీడ్స్ వారి ఆధ్వర్యంలో సబ్సిడీ ద్వారా రైతులకు అందించడం జరుగుతుంది. కావున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నేల సాంద్రతను కాపాడాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం డైరెక్టర్ గంటే ఓట్లప్ప రైతులు బండె శివరాజ్, లింబయ్య,భూమయ్య, లక్ష్మణ్,దత్తు సహకార సంఘం ఇంచార్జ్ కార్యదర్శి సంజువ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *