పయనించే సూర్యుడు మే 21, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహకారంతో ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా రూరల్ నియోజకవర్గం లో నేటివరకు సుమారు 294 మందికి ఆర్థిక సహాయాన్ని అందించి వారి కుటుంబాలను ఆదుకోవడం జరిగిందని ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు కాకినాడ గుడారిగుంట రూరల్ శాసనసభ్యులు క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా 3 (మూడు )LOC లతో కలిపి 27 మందికి మంజూరు అయిన 22 లక్షల 14 వేల 802 రూపాయల చెక్ లను లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు నియోజకవర్గం నుండి 379 అప్లికేషన్స్ పంపించగా ఈనాటి కి సుమారు 294 మందికి 2 కోట్ల 76 లక్షల 60వేల 167 రూపాయలు ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా ఆర్ధిక చేయిత అందించామన్నారు. ఇంకా 85 అప్లికేషన్స్ పరిశీలన లో ఉన్నాయి అని తెలిపారు.. ఈ కార్యక్రమం లో ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి, కూటమి నాయకులు పితాని లీల, శిరంగు శ్రీనివాస్ , నల్లే ప్రసన్న , తాటికాయల వీరబాబు, తిరుమాని కుమారస్వామి ,కరెడ్ల గోవింద్ , బండారు మురళి, సోదే ముసలయ్య , తోటకూర సతీష్ , అనుకూల రాంబాబు ,యర్రంశెట్టి ప్రసాద్, పుణ్యమంతుల అన్నవరం, ముమ్మిడి పట్టాభి, మాదారపు తాతాజీ, దొరబాబు ,బూరయ్య , బండారు మణికంఠ, మీసాల రాంబాబు,గేదల చిన్నారావు ,మౌళి , గరికిన సురేష్ , మల్లె భాస్కర్ , వెలుగుబంట్ల సూరిబాబు ,సునీల్ , బాలాజీ , మహేష్ , గంజా దుర్గా ప్రసాద్, బండారు ప్రసాద్ ,లబ్ధిదారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.